బిగ్ బాస్ 2 లో జరుగుతున్న కుట్ర బయటపడింది..! మీరు కూడా ఇది గమనించారా.?    2018-06-27   00:01:28  IST 

ఫన్నీ కామెంట్స్‌ కార్డ్స్‌ను ఎంపిక చేసుకోని వాటికి సరిపోయే హౌస్‌ మెట్స్‌ను ఎంపిక చేయమని బిగ్‌ బాస్‌ హౌస్‌మెట్స్‌కు ఓ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా అత్యంత నిర్భమైన వ్యక్తి భాను శ్రీ అని గీతామాధురి సూచించింది. ఆమె ఎవరికి భయపడదని, ఎదొస్తే అదే మాట్లాడుతుందని తెలిపింది. విచిత్రమైన వ్యక్తి తేజస్వీ అని, అప్పుడే కోప్పడి, అప్పుడే కలిసిపోతుందని దీంతో ఆమె వ్యక్తిత్వం అర్థం కావడం లేదని శ్యామల పేర్కొంది. మానిపపులేటర్‌, అపరిశుభ్రమైన వ్యక్తి రోల్‌రైడా అని దీప్తీ, సామ్రాట్‌లు సూచించారు. బిగ్‌బాస్‌ వదిలివేళ్లే వ్యక్తి గణేశ్‌ అని భాను శ్రీ సూచించగా.. అగ్లీగా ప్రవర్తించే వ్యక్తి కిరిటీ అని, అతను మాస్క్‌ వేసుకొని తిరుగుతారని దీప్తీ సునైనా పేర్కొంది. హౌస్‌లో అన్‌ఫెయిర్‌ దీప్తీ అని తేజస్వీ సూచించగా.. తనీష్‌, తేజస్వీ అసభ్యకరమైన వ్యక్తిగా పేర్కొన్నాడు. ఎక్కువ ప్రేమలో పడే వ్యక్తి తనీష్‌ అని కౌశల్‌, అతిపెద్ద తిండిబోతు తను, రోల్‌రైడా అని గణేశ్‌ ఒప్పుకున్నాడు. వెన్నుపోటు పొడిచే వ్యక్తి కౌశల్‌ అని కిరిటీ పేర్కొన్నాడు. హౌస్‌మెట్స్‌ మధ్య గొడవ పెట్టించే వ్యక్తి దీప్తి సునైనా అని బాబుగోగినేని తెలిపాడు.

ఈ ఎపిసోడ్‌లో తేజస్వీ, సామ్రాట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి మధ్య స్నేహంకు మించి ఎదో ఉన్నట్లు అనుమానం కలిగేలా ప్రవర్తించారు. హౌస్‌మెట్స్‌కు దూరంగా గుసగులాడటం.. ఒకరి మీద ఒకరు పడటం, తినిపించుకోవడం చూస్తే ఓ ప్రేమ జంటలా ప్రవర్తించారు. అయితే ఇది గేమ్‌లో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్నారా? లేక సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఏమైనా ఉందా? అని తెలియాలంటే.. మరన్నీ ఎపిసోడ్స్‌ జరగాల్సిందే. అయితే తేజస్వీ మాత్రం ఓ ప్రణాళికతో హౌస్‌లోకి వచ్చిందన్న విషయం అర్థం అవుతోంది. హౌస్‌లో ఓ సందర్భంలో గణేశ్‌తో మాట్లాడుతూ..