జై లవకుశ లో పొలిటికల్ సెటైర్స్…ఎవరికోసం  

జై లవకుశ లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ సెటైర్స్ తో సంచలనానికి తెర తీయబోతున్నాడట.ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పార్టీ అధ్యక్షుడిగా కనిపిస్తున్నారు అని పుకార్లు వస్తున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్న వేలా ఇదేంది అని అనుకుంటున్నారా..మరి అంతేగా వాడుకున్నంత సేపు వాడుకున్నారు తరువాత ఒంటరోడిని చేసి వెళ్ళిపోయారు. పట్టించుకున్న పాపాన పోలేదు..అందుకే ఆ కసి మొత్తం ఇప్పుడు ఈ సినిమా రూపంలో తీర్చుకోబోతున్నాడు.

నందమూరి ఫ్యామిలీకి సినిమా పరంగా ఉన్న ఒకే ఒక్క దిక్కు జూనియర్ ఎన్టీఆర్..బాలయ్య బాబు ఉన్నా సరే జూనియర్ తో పోల్చుకుంటే అంత సీన్ లేదని చెప్పచ్చు..అందులోనూ జూనియర్ కి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటి అంటే జూనియర్ కి తన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాకుండా..మిగతా హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.అందరు తన సినిమాలని ఆదరిస్తారు.సో ఫ్యూచర్స్ లో ఎటు చూసినా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ప్రధాన పాత్రధారి కాకా మానడు.ఒక రకంగా చెప్పాలి అంటే తనే పార్టీకి దిక్కు అనే విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

జై లవకుశ లో రాజకీయ ప్రస్తావన ఏమి లేదు అని ఎన్టీఆర్ వివరణం ఇచ్చుకున్నాడు.సినిమా పాత్రలని బట్టి డైలాగ్స్ ఉంటాయి తప్ప దీనిలో రాజకీయ కోణం చూడవద్దు అని చెప్పాడు. రాజకీయం అనేది ఒక భాగంగా ఉంటుంది తప్ప వేరే విశేషం ఏమి లేదు అని వివరించాడు. అది పాత్ర కోసం పెట్టిన సెటప్ తప్ప దాన్ని కావాలని ఇరికించలేదని, సినిమాలో పొలిటికల్ పంచులేమీ ఉండవని అతను స్పష్టం చేశాడు.ఈ సినిమా మీద ఉన్న ఊహాగానాలకి ఇక్కడితో తెరదించాలని కోరాడు. ఏమో ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే 21 వరకు వేచి చూడాల్సిందే మరి