హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతునందుకు..పోలీసులు అతనికో వెరైటీ శిక్ష వేశారు.! ఏంటో తెలుసా.?     2018-07-10   00:01:55  IST  Raghu V

చేతిలో 200 CC బైక్…. చెవిలో ఇయర్ ఫోన్స్… పాటకు తగ్గ స్పీడ్ తో రోడ్డు మీద రయ్ అంటూ దూసుకుపోవడం.. కాస్త తేడా వచ్చిందో ఎగిరి అంతదూరంలో పడడం, తలకు బలంగా దెబ్బ తగలడం, ICU లో పేషెంట్ గా చేరడం.. శవమై స్మశానానికి వెళ్లడం.కన్న వారికి తీరిన కడుపు కోత ను మిగల్చడం…. ఇటువంటి సంఘటనలు చాలా చూశాం. మోటర్ బైక్ యాక్సిడెంట్స్ లో చాలా వరకు హెల్మెట్ లేని కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయనే రిపోర్ట్స్ కూడా చాలానే ఉన్నాయ్.

అయితే హెల్మెట్ పెట్టుకోవడం పై అనేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూనే ఉన్నారు పోలీసులు. దీనికి చక్కని ఉదాహరణే ఈ వీడియో… ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్ మీద రావడం… పోలీసులకు చిక్కడం… ఆ యువకుడికి పోలీసులు వెరైటీ శిక్ష వేయడం చకచకా జరిగిపోయాయ్.

ఈ వీడియోను కరీంనగర్ పోలీసులు .. హెల్మెట్ ధరించడం పట్ల టూ వీలర్ వారికి అవగాహన కల్గించడం కోసం చేశారంట.. దీన్ని చూశాక కూడా మనం హెల్మెట్ లేకుండా అడ్డదిడ్డంగా రోడ్లపై పోతే…. విలువేముంటుంది చెప్పండి?