హనీప్రీత్ లో ఈకోణం చూసి షాక్ అయ్యిన పోలీసులు

గుర్మిత్ సింగ్ విషయం ఏమో కానీ…దత్తపుత్రిక గా చెప్పుకుంటున్న హనీ ప్రీత్ సింగ్ మటుకూ పోలీసులకి దొరకకుండా చుక్కలు చూపించింది. తానూ ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నట్టు..అసలు ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటానికి చాలా పెద్ద కారణమే ఉందట కొందరు అధికారుల సహాయంతో పోలీసుల నీడ తనపై పడకుండా హనీప్రిత్ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడిందట అంటే తనకి ఎంత నెట్వర్క్ ఉందొ చెప్పచ్చు.

ఇప్పుడు ఆమె మీద ఉన్న ఒక బలమైన ఆరోపణ ఏమిటి అంటే. హెలికాఫ్టర్ బయల్దేరాక గుర్మీత్ తో పారిపోయేందుకు దాన్ని దారి మళ్లించే ప్రయత్నం హనీప్రిత్ చేశారన్న అభియోగాలు ఇప్పుడు ఆమె కేసులో వున్నాయి . దీనికి సంబంధించి కాక్ పీట్ లో జరిగిన సంభాషణ న్యాయస్థానం ముందు సాక్ష్యంగా పెడితే తాను గుర్మీత్ అమాయకులమని మీడియా కు కోర్టు కి చెప్పిన ఆమె బండారం బయటపడుతుందంటున్నారు.