ఓ ఇంటి గార్డెన్ ని టాయిలెట్ లా వాడుతూ టార్చర్ పెడుతున్న అమ్మాయి – పోలీసుల వెతుకులాట

మనదేశంలో టాయిలెట్ లేని ఇల్లుల్లు ఇప్పటికి వేళలో కాదు, లక్షల్లో ఉంటాయి అనుకుంటా. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన అనేది మన దేశంలో ఒక మామూలు విషయం. పల్లెల్లో అయినా ఇళ్ళకు దూరంగా పొలాల్లోకి వెళ్లి పని కానిస్తారు కాని పట్టన్నల్లో, హైవే పక్కన్నే మూత్రవిసర్జన చేస్తారు చాలామంది. ఆమధ్య హైదరాబాద్ పోలీసులు ఇలా చేస్తున్నవారి ఫోటోలు తీసి నెట్ లో పెట్టేసారు. అది చూసైనా ఇలాంటి పనులు నిజంగానే మానేస్తారు అనుకుంటే అది అత్యాశే. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్స్ అరేంజ్ చ్చేసినా, ఏమాత్రం లాభం లేదు. ఎందుకు అంటే, అలా చేయడం చట్టరీత్య నేరం కాదు కాబట్టి.

ఇలాంటి పనులు వెస్ట్రన్ దేశాల్లో చేస్తే జైల్లో వేస్తారు. కాని పోలీసులని కూడా ముప్పుతిప్పలు పెడుతోంది ఓ అమ్మాయి. అమెరికాలోని కలోరాడో ప్రాంతంలో ఒక ఇంటిని తన టాయిలెట్ గా మార్చుకుంది ఓ గుర్తుతెలియని అమ్మాయి. పేరు తెలియదు, ఊరు తెలియదు, ఆచూకి తెలియదు. అసలు ఆమెకి మతిస్థిమితం ఉందొ లేదో కూడా తెలియదు.