Pokiri sentiment for Bharat Ane Nenu

మహేష్ బాబు కెరీర్ లో ఎన్ని బ్లాక్బస్టర్స్ ఇచ్చినా, పోకిరి స్థాయి స్థానం వేరు. ఆ కాలంలో, ఆ టికెట్ రేట్లతో పోకిరి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఏ హీరో అభిమాని అయినా సరే, పోకిరి సినిమాని, అందులో మహేష్ నటనని అభిమానించకుండా ఉండలేడు. మహేష్ లోని సూపర్ స్టార్ ని బయటకి తీసుకొచ్చిన సినిమా అది. మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ ని అమాంతం పెంచేసిన ఇండస్ట్రీ హిట్ అది. కాని ఆ తరువాత మహేష్ కెరీర్ మిశ్రమ రితీలో సాగింది. ఒక బ్లాక్బస్టర్ కొట్టి ఇలా కొత్త రికార్డులు పెడతాడో లేదో, మళ్ళీ రెండు ఫ్లాపులు ఇస్తూ వస్తున్నాడు. ఇక ఈమధ్య కాలంలో మహేష్ ఫామ్ గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. గత అయిదు సినిమాల్లో ఏకంగా 4 డిజాస్టర్స్.

ప్రిన్స్ అభిమానులు ఇంకా బ్రహ్మోత్సవం, స్పైడర్ బాధలోనే ఉన్నారు కాని, వారికి మంచి రోజులు రాబోతున్నాయి. శ్రీమంతుడు లాంటి రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్బస్టర్ ఇచ్చిన కొరటాల శివ, మరోసారి అదే రేంజ్ సినిమాని అందిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమా మీద కొరటాల ఎంత నమ్మకంతో ఉన్నారంటే, పోకిరి హిస్టరీ రిపీట్ అవుతుంది అనే నమ్మకంతో పోకిరి సెంటిమెంట్ ని ఫాలో అవుతూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. 2018 వ సంవత్సరం, ఏప్రిల్ 27న భరత్ అనే నేను విడుదల అవుతుంది. ఇది అఫీషియల్ న్యూస్.