మహేష్ ప్రభాస్ లకు లేఖ రాసిన నరేంద్ర మోడీ  

భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిసరాల శుభ్రత కోసం మొదలుపెట్టిన స్వచ్ఛభారత్ అభియాన్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ ప్రోగ్రాంని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు సినిమారంగంలోని క్రీడారంగంలోని తారలకు లేఖలు రాశారు ప్రధాని. తాము పాల్గొంటూ ప్రజలు కూడా ఈ మంచి కార్యక్రమంలో మరింత ఆసక్తి తో పాల్గొనేలా చేసేందుకు పాటుపడాలని ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని లేఖలో ఈ సెలబ్రెటీలను కోరుకున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు ఈ లేఖను అందుకున్నవారిలో యావత్ భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర దర్శకుడైన రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ప్రధానికి బాగా పరిచయస్తులైన మోహన్ బాబు ఉన్నారు. హిందీ, తమిళ, మలయాళ చిత్ర రంగాల్లోని అగ్ర దారులకు కూడా ఈ లేఖలు అందాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని లేఖలు అందుకున్న తారలతో ఓ స్పెషల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

మహేష్ బాబు, ప్రభాస్ దేశవ్యాప్తంగా పాపులారిటీ, అభిమానం ఉన్నవారు. ఇక రాజమౌళి ఎవరనేది దేశం నలుమూలల ఎవరినీ అడగాల్సిన పనిలేదు. అందుకే వీరిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం ఎంచుకున్నారు ప్రధాని. ఆశ్చర్యకర విషయం ఏమంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ – టీడిపి కూటమికి మద్దతునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఈ లేఖను అందుకోలేదు.