యూటర్న్‌ కంటే ముందు శైలజారెడ్డి అల్లుడు చూడండి ప్లీజ్‌...     2018-09-11   10:10:41  IST  Ramesh P

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం ఈనెల 13న వినాయక చవితి శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ అత్త పాత్రలో పోషించడంతో అంచనాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రంతో చైతూ కెరీర్‌లో ది బెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ను దక్కించుకునేందుకు సిద్దంగా ఉన్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక శైలజా రెడ్డి అల్లుడు చిత్రం విడుదల అవుతున్న రోజే ‘యూటర్న్‌’ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

Sailaja Reddy Alludu,Sep 13 The Releases,U Turn Telugu Movie,Vinayaka Chavithi Movies

నాగచైతన్య భార్య అయిన సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యూటర్న్‌’ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సమంత యూటర్న్‌ చిత్రంపై చాలా అంచనాలు పెట్టుకుంది. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న యూటర్న్‌ చిత్రంకు శైలజ రెడ్డి అల్లుడు చిత్రం పోటీగా మారింది. తాజాగా నాగచైతన్య మీడియాతో మాట్లాడుతూ సమంత సినిమా కంటే ముందు నా సినిమా చూడండి అంటూ చెప్పడంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది.

నాగచైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఆ వ్యాఖ్యలను చైతూ ఫన్నీగా చేశాడు. ఎలాగూ సమంత ఈ సంవత్సరంలో రంగస్థలం మరియు మహానటి చిత్రాలతో వచ్చి విజయాలను దక్కించుకుంది. అందుకే ఈ సంవత్సరంలో మొదటి సారి వస్తున్న నా సినిమాను మొదట చూడండి అంటూ లాజిక్‌తో నాగచైతన్య అభిమానులను కోరుతున్నాడు.

Sailaja Reddy Alludu,Sep 13 The Releases,U Turn Telugu Movie,Vinayaka Chavithi Movies

అక్కినేని ఫ్యాన్స్‌ మాత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’ మరియు ‘యూటర్న్‌’ చిత్రాలపై భారీ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకోవాలని కోరుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు చిత్రాలు ఎలాంటి ఫలితాలను సాధిస్తాయి. భార్య భర్తలు అయిన చైతూ, సమంతలకు ఎలాంటి ఫలితాలను మిగుల్చుతుందో చూడాలి.