Petrol Bunks to be closed on Sundays from May 14 in these 8 states

పెట్రోల్ రెట్ల ఎగుడుదిగుడుతో ఇబ్బందిపడుతున్న జనాలపై మరో పెద్ద బాంబు పడనుంది. మళ్ళీ క్యాష్ దొరక్క నరకం చూస్తున్న మహానగర ప్రజలు, ఇకనుంచి నోట్ల అవసరం లేకుండా కార్డులతోనే ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవాలి. మే 14, ఈ తేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మే 14 నుంచి మొదలు, ఆదివారాలు మీకు పెట్రోల్ దొరకదు. అన్ని కంపెనీల, చిన్నాచితకా పెట్రోల్ అవుట్ లెట్స్ మూసేసి ఉంటాయి. దీన్ని జోకులా తీసుకోకండి .. ఇదేమి ఏప్రిల్ ఒకటవ తారీఖు కాదు. నిజంగానే ఈ కొత్త ప్లాన్ అమలు లోకి రానుంది. ముందుగా 8 రాష్ట్రాల్లో ఆదివారం పెట్రోల్ బంకుల బంద్ మొదలవుతోంది. ఆ 8 రాష్ట్రాలు ఏవంటే …

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళా, కర్ణాటక, హర్యానా, పుదిచేర్రిలో మే 14 నుంచి మొదలు, ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసేసి ఉంచబోతున్నారు. ఇలా ఎందుకు అనే కదా మీ డౌటు? ఆయిల్ ని ఆదా చేయడం కోసం అంట. ఇటివలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కి బాత్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ, ఆయిల్ ఆదా గురించి తన మనసులో మాట చెప్పారు. దాంతో పెట్రోల్ డీలర్స్ అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.