People don’t come to see naked heroines – says Manjima Mohan

నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా చూసారుగా. అందులో చైతు పక్కన మెరిసిన మంజిమా మోహన్ గుర్తుందిగా. ఎలా మర్చిపోతారు లెండి అంత అందమైన అమ్మాయిని. ఇటు సినిమాల్లో, అటు బయటిప్రపంచంలో కూల్ గా కామ్ గా ఉండే ఈ మలయాళీ భామ మొదటిసారి ఫైర్ అయ్యింది. అదికూడా అవాల్సిన చోటే, అవాల్సిన కారణంతోనే.

ఎవరో ఓ ట్విట్టర్ యూజర్ మంజిమాను ట్యాగ్ చేసి హీరోయిన్ల గురించి కొంచెం తప్పుగా మాట్లాడాడు. హీరోయిన్ల స్కిన్ షో చూసేందుకే, వారి అర్థనగ్న నృత్యాలు, చిన్న చిన్న బట్టలు చూసేందుకే జనాలు సినిమాలకు వస్తారని ఓ చీప్ కామెంట్ పాస్ చేసాడు. దాంతో మంజిమా కోపంతో ఊగిపోయింది. వెంటనే చెంప చెళ్ళుమనేలా సమాధానం ఇచ్చింది.

“హీరోయిన్లను బట్టలు లేకుండా చూడడానికే జనాలు థియేటర్ కి వస్తారని మీరు అనుకుంటే అది తప్పు సార్. వాళ్ళు మంచి సినిమాలు చూడడానికి వస్తారు. తగ్గిన బట్టల సైజు చూడడానికి కాదు” అంటూ వినయంగా గట్టి సమాధానం ఇచ్చింది.

జవాబు అయితే ఇచ్చింది మరి మంజిమా చిన్న చిన్న బట్టలు వేసుకొని స్కిన్ చేయదా అని మీకు డౌటు రావొచ్చు. మంజిమా ఇంతవరకు స్కిన్ షో చేయలేదు. నాలుగు సినిమాలు పూర్తీ చేసింది, మరో రెండు సినిమాల్లో ప్రస్తుతం నటిస్తోంది. అయినా ఇప్పటివరకు స్కిన్ షో చేసింది లేదు. ఎన్టీఆర్ – బాబి సినిమాలో హీరోయిన్ గా మంజిమాను కూడా అనుకున్నారు. కాని ఈ భామ స్కిన్ షో చేయదని తెలిసి ఆ స్థానంలో రాశీఖన్నాని తీసుకొచ్చినట్టు టాక్