మీరు 9 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?     2018-06-20   00:51:28  IST  Raghu V

9 వ తారీఖున జన్మించిన వారి గుణాలు,ప్రవర్తన,బలాలు,బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. 9 వ సంఖ్యకు అధిపతి కుజుడు. కాబట్టి వీరి మీద కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వీరు మంచి ఆలోచన శక్తితో వేగంగా నిర్ణయాలను తీసుకుంటారు. వీరు ఏ పని చేసిన సాహసవంతంగా ఉండాలని కోరుకుంటారు. వీరు చేసే పనులు రిస్క్ కలిగి ఉండుట వలన కొన్ని విజయాలు కొన్ని పరాజయాలు కూడా ఉంటాయి. కాబట్టి వీరు కాస్త అలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి.

వీరికి జీవితంలో హెచ్చుతగ్గులు తరచుగా ఉంటూ ఉంటాయి. వీరికి కోపం వస్తే ఆపటం ఎవరి వల్ల కాదు. అంతలా వారికీ విపరీతమైన కోపం వస్తుంది. అందువల్ల ఆవేశం,కోపం రాకుండా చూసుకుంటే మంచిది. వీరికి ఆత్మ గౌరవం ఎక్కువ. వీరు గొడవలకు వెళ్ళరు. కానీ ఎవరైనా వీరి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం గొడవలకు వెళతారు.