మీరు 8 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?     2018-06-17   01:46:17  IST  Raghu V

8 వ తారీఖున జన్మించిన వారి గుణాలు,ప్రవర్తన,బలాలు,బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. 8 వ సంఖ్యకు అధిపతి శని. అందువల్ల వీరు జీవితాంతం కస్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు కాస్త ఎక్కువగా కష్టపడితేనే విజయాలు వస్తాయి. వీరు ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే పనులను చేస్తూ ఉంటారు. అలాగే తన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలని కోరుకుంటారు. వీరు ఎక్కువగా హేతుబద్దంగా ఆలోచనలు చేస్తారు. ఎవరైనా వీరిని పొగిడితే ఆ మాయలో పడకుండా కాస్త ఆలోచిస్తారు.

వీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఎప్పుడు పని,ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీరు పది మందితో కలిసి మెలసి తిరగలేరు. వీరు ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతారు. వీరు అవసరం మేరకు మాత్రమే మాట్లాడతారు. ఎక్కువగా మాట్లాడటం కూడా ఇష్టం ఉండదు.