మీరు 7 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?     2018-06-13   23:46:47  IST  Raghu V

7 వ తారీఖున జన్మించిన వారి గుణాలు,ప్రవర్తన,బలాలు,బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. 6 వ సంఖ్యకు అధిపతి కేతుడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కేతువుని మోక్ష కారకుడిగా చెప్పుతారు. అందువల్ల వీరి మాట తీరు,ఆలోచనలు, వీరు చేసే పనులు అన్నీ మోక్షం వైపుకి ఉంటాయి. వీరికి భగవంతుని మీద ఎక్కువగా భక్తి,ఆరాధన,విశ్వాసం ఉంటాయి. వీరు సంపాదించిన ధనంలో కొంత దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచి ఇతరులకు సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు.

వీరు ప్రేమ,శాంతి పూరిత వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు గొడవలకు దూరంగా ఉంటారు. అంతేకాక వీరు ఇతరులతో సర్దుకుపోయే తత్త్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరిని నలుగురు మంచివారిగా గుర్తిస్తారు. వీరు పొగడ్తలను అసలు పట్టించుకోరు.