మీరు 6 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?     2018-06-09   23:50:47  IST  Raghu V

6 వ తారీఖున జన్మించిన వారి గుణాలు,ప్రవర్తన,బాలలు,బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. 6 వ సంఖ్యకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. అందువల్ల 6 వ తారీఖున జన్మించిన వారిపై శుక్ర గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ద పెడతారు. అలాగే వీరిలో నిజాయితీ కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. వీరు అందంగా,ఆకర్షణీయంగా కన్పిస్తారు. అందరిలో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు.

వీరు ఒక పని పూర్తి అయ్యాక మాత్రమే మరొక పని గురించి ఆలోచన చేస్తారు. అంతేకాని ఒక పని మధ్యలో ఉన్నప్పుడు అసలు మరొక పని గురించి ఆలోచన చేయరు. వీరి ఆలోచనలు చాల లోతుగా ఉంటాయి. అందువల్ల వీరి ఆలోచనల గురించి ఎదుటి వాడు తెలుసుకొనే అవకాశం ఉండదు.