16 వ తేదీన జన్మించారా... మీ బలాలు,బలహీనతలు,అదృష్టం గురించి తెలుసుకోండి     2018-08-20   10:00:05  IST  Sainath G

అది ఏ నెలైనా కావచ్చు, ఏ సంవత్సరమైనా కావచ్చు, 16వ తేదీ న జన్మిస్తే చాలు. వాళ్లకు ఎలాంటి లక్షణాలు, వాళ్ళ బలం ,బలహీనతలు ఏమిటో, ఎలా ఉండాలో వంటి విషయాలను సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇప్పుడు తెల్సుకుందాం. ఒకటి కి అధిపతి సూర్యుడు. ఆరుకి శుక్ర గ్రహం అధిపతి . ఈరెండు కలిపితే వచ్చే ఇక సంఖ్య 7కి అధిపతి కేతు గ్రహం. ఈ మూడు గ్రహాల ప్రభావం 16వ తేదీన పుట్టిన వారిపై ఉంటుందని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు. ప్రతిదాన్ని పరిశీలనా దృక్పధంతో వీళ్ళు లోతుగా చూస్తారు. ఎవరైనా విషయం చెబితే వెంటనే ఆకర్షితులవ్వకుండా ఆలోచిస్తారు.

Birthday Number 16,People Born

ఇక వీరికి ఆకర్షణ శక్తి ఉంటుంది. పాజిటివ్ గా వుండే వీళ్ళు అతి సులభంగా పనులు పూర్తిచేయగలరు. ఆ రంగంలో అనుభవం ఉంటే వీరు తేలికగా విజయాలు వరిస్తాయి. క్రీడలు వంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో వుండేవాళ్ళు ప్రోత్సహిస్తారు. తక్కువ సమయంలో రాణిస్తారు. ఎంత డబ్బు సంపాదించినా సరే, ఓ స్టేజి వచ్చాక భగవంతునివైపు

దృష్టి సారించి సమాజ స్థితిగతులు, అభ్యున్నతి వైపు ఖర్చుచేస్తారు. కేతు గ్రహ ప్రభావం వలన ఎంతమంది చుట్టూ వున్నా సరే, ఒంటరి వైపు ఆలోచనలు వెళ్తాయి. పదిమందికి ఉపయోయాగం చేస్తేనే వీరికి మనసు శాంతిగా ఉంటుంది. ఇంట్లోవాళ్ళు కూడా వీళ్ళను ప్రోత్సహించాలి. ఆ దిశగా 16వ తేదీ న జన్మించిన వాళ్ళు ఆలోచన చేస్తారు.కేతువుకి బలం లేకపోతే, కొంత చెడువైపు వెళ్లే ప్రమాదం వుంది. దీన్ని ఇంట్లో వాళ్ళు గుర్తించి సరైన మార్గంలో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. స్త్రీల ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. బుధవారం ఉపవాసం ఉంటె మంచిందని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.