మీరు 10 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?     2018-06-22   04:23:44  IST  Raghu V

10 వ తారీఖున జన్మించిన వారి గుణాలు,ప్రవర్తన,బలాలు,బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. 10 వ సంఖ్యకు సూర్యడు అధిపతి. వీరి మీద సూర్య గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి విజయాల శాతం ఎక్కువగా ఉన్నా సరే ఒక్కసారిగా కాకుండా నిదానంగా ముందుకు సాగుతారు. వీరు జీవితంలో కష్టపడి పనిచేసి విజయాలను అందుకోవటం వలన తక్కువ సమయంలోనే టార్గెట్ ని రీచ్ అవుతారు. వీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థితిలోకి వెళతారు.

వీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వీరికి విజయాలు తేలికగా రావు. చాలా కస్టపడి సంపాదించుకోవాలి. వీరికి జీవితంలో ఏది సులువుగా రాదు. కష్టపడి సంపాదించుకోవాలి. వీరిని పది మంది వ్యక్తులు నమ్ముతారు. వీరు ఏ రంగంలో ఉన్నా సరే వీరికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.