పెళ్లి పీటలపై అన్నను పక్కకి తోసి…వధువుకు తాళి కట్టిన “పెళ్ళికొడుకు తమ్ముడు”..! తర్వాత ఏమైంది?     2018-05-28   00:19:45  IST  Raghu V

తమిళనాడు లోని ఒక పెళ్ళిలో జరిగిన ట్విస్ట్ ఇప్పుడు దేశం మొత్తం వైరల్ గా మారింది. పెళ్లి పీటలపై పెళ్ళి కొడుకు, కూతురు కూర్చున్నారు. పెళ్ళి కొడుకుని వధువుకి తాళి కట్టమని చెప్పాడు పురోహితుడు. పెళ్లి పీటలపై వధువు మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న అన్నను పక్కకు తోసేసి తమ్ముడు తాళి కట్టిన సంఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో జరిగింది.

వెల్లురు జిల్లా తిరుపత్తూరు తాలుకా సెల్లరపట్టి గ్రామానికి చెందిన కామరాజ్‌ కు ముగ్గురు కుమారులు రంజిత్, రాజేష్, వినోద్‌ ఉన్నారు. వీరిలో రాజేష్, వినోద్‌ తిరుప్పూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం రెండో కుమారుడు రాజేష్‌కు మదురైకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు.