Pawan To Contest From Anantapur

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన మూడు వ‌సంతాలు పూర్తి చేసుకుంది. ప్ర‌శ్నిస్తానంటూ జ‌న‌సేన పార్టీ పెట్టిన ప‌వ‌న్ 2014 ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నాడు. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఏపీ, తెలంగాణ‌లో బీజేపీ+టీడీపీ కూట‌మికి బ‌లంగా స‌పోర్ట్ చేశాడు. అయితే ఆ ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌డంలో ఫెయిల్ అవ్వ‌డంతో ప‌వ‌న్ వాటిపై స్వ‌రం పెంచాడు. ఈ రెండు పార్టీల తీరును ఎండ‌గ‌ట్టాడు.

ఇక కొద్ది రోజులుగా ఏపీలో వ‌రుస‌గా భారీ స‌భ‌లు పెడుతూ వ‌స్తోన్న ప‌వ‌న్ జ‌న‌సేన మూడో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ప్రెస్‌మీట్ ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అనుమానాలు నివృత్తి చేసేశాడు. ఇక అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ తాను క‌ర‌వు ప్రాంత‌మైన అనంత‌పురం జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.