Pawan skipped that scene with Shruti because of waist pain

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటోంది. మరో వారం నుంచి పదిరోజుల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుందట. ఇక ఈ సినిమా మార్చి 29న విడుదల కావడం దాదాపుగా ఖరారు అయిపోయినట్లే. శృతిహాసన్ పవన్ కి జంటగా నటిస్తుండగా, శరత్ మరార్ నిర్మాణంలో డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు తమిళ బ్లాక్ బస్టర్ వీరమ్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

కాని కాటమరాయుడు వీరమ్ కి మక్కికి మక్కి కాపి కాదట. మార్పులు చేర్పులు బాగానే చేసినట్టు శృతిహాసన్ ఇప్పటికే చెప్పింది. అయితే, మార్చిన సీన్లలో ఒక కీలకమైన సన్నివేశాన్ని కూడా తొలగించారని వార్తలు వస్తున్నాయి. అది కూడా పవన్ కళ్యాణ్ నడుంనొప్పి కారణంతో తీసేసారట. ఇంతకి ఆ సీన్ ఏంటి అనుకుంటున్నారు? శృతిహాసన్ ని పవన్ ఎత్తుకోని పరిగెత్తే సన్నివేశం.

పవన్ ని చాన్నాళ్ళుగా నడుంనొప్పి సమస్య బాధపెడుతోందట. ఇలాంటి సమయంలో, శృతిని ఎత్తుకోవడం అంటే రిస్కీ వ్యవహారమే కదా. మళ్ళీ సీన్ ఒక టేక్ లో అయిపోదు కదా, ఎన్ని టేకులు పడతాయో చెప్పలేం, ఈ సీన్ వలన తనకు నొప్పి ఎక్కువైనా, నొప్పి తట్టుకోలేక పట్టుతప్పి శృతిని కిందపడేసినా, ఇబ్బందే కదా. అందుకే వీరమ్ లో అజిత్, తమన్నాపై తీసిన ఆ సీన్, తెలుగులో తీయలేదని మీడియా టాక్.