2019లో పోటీపై ప‌వ‌న్ షాకింగ్ డెసిష‌న్‌

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి చేసినా సంచలనమే.ఇప్పుడు పవన్ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. తన అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడంతో అప్పుడు తానూ మాట్లాడిన ప్రతీదీ ఇప్పుడు నిరూపించుకోవలసిన అవసరం తనమీద ఉందని చెప్పారు.పా ర్టీకోసం,సమాజం కోసం నేను రాజకీయాలలోకి వచ్చాను తప్ప దీనిలో స్వార్ధం లేదని పవన్ స్పష్టం చేశారు.

జనసేన తరుపున 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. అయితే 2018 చివర్లో ఈ విషయంలో స్పష్టత వస్తుందన్నారు. అప్ప‌టికి త‌న‌కు ఉన్న బ‌లాన్ని బేస్ చేసుకుని తాను 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

తాను ఇంకా సినిమాల్లో న‌టిస్తున్నాన‌ని, త్వ‌ర‌లోనే సినిమాలు కంప్లీట్ చేసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ‌తాన‌ని ప‌వ‌న్ తెలిపారు. ఎన్నికల్లో కేవలం సీట్లు గెలవడమే తన లక్ష్యం కాదని పవన్,గెలిచినా ఓడినా ప్రజల కోసం ఎప్పుడు పరితపించే మనిషిని అని తేల్చి చెప్పారు. ఇక ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 10న రిలీజ్ అవుతోంది. వ‌చ్చే అక్టోబ‌ర్ నుంచి ప‌వ‌న్ కంటిన్యూగా జ‌నాల్లోకి వెళ్ల‌నున్నారు.