Pawan Klayan and Ntr Follows Same Ways

నంద‌మూరి యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇటు త‌మ నందమూరి ఫ్యామిలీతో పాటు అటు నారా ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌లో కనిపించి చాలా యేళ్లు అవుతోంది. ఈ విష‌య‌మై నంద‌మూరి అభిమానుల్లో ఎంతో క‌న్‌ఫ్యూజ‌న్ ఉంది. రీసెంట్‌గా నారా లోకేశ్ మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కార్య‌క్ర‌మానికి సైతం హ‌రికృష్ణ‌, క‌ళ్యాణ్‌రామ్ వ‌చ్చినా ఎన్టీఆర్ రాలేదు. ఇక ఎన్టీఆర్ ఫంక్ష‌న్ల‌లో బాల‌య్య‌ను, బాల‌య్య ఫంక్ష‌న్ల‌లో ఎన్టీఆర్‌ను చూసి చాలా రోజులైంది.

చంద్ర‌బాబు ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో క‌ట్టుకున్న కొత్త ఇంటి గృహ‌ప్ర‌వేశానికి కూడా ఎన్టీఆర్‌కు ఆహ్వానం లేదని వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా ఈ ఇద్ద‌రు టాప్ హీరోలు ఇండ‌స్ట్రీలో స్టార్లుగా ఉన్నా ఫ్యామిలీ విష‌యంలో మాత్రం వాళ్ల‌కు దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు.