Pawan Klayan and Ntr Follows Same Ways

టాలీవుడ్‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఇద్ద‌రి హీరోల‌కు ఇటు సినిమాల‌తో పాటు అటు రాజ‌కీయాల‌తోను ట‌చ్ ఉంది. ఎన్టీఆర్ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు. ప‌వ‌న్ సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా రంగంలోను, రాజ‌కీయ రంగంలోను ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ ఫ్యామిలీ విష‌యంలో మాత్రం ఒకే రూటులో వెళుతున్నారు. చాలా కాలంగా వీరిద్ద‌రు త‌మ కుటుంబాల‌కు దూర‌మ‌వుతున్నారు.

మెగా ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌లోను, ఈవెంట్ల‌లోను ప‌వ‌న్ క‌నిపించి చాలాకాల‌మే అయ్యింది. మెగా హీరోల ప్ర‌తి ఆడియో ఫంక్ష‌న్ల‌లోను ప‌వ‌ర్‌స్టార్ గురించి ఫ్యాన్స్ నినాదాలు చేస్తూనే ఉంటారు. మెగా హీరోల‌కు ప్ర‌తిసారి ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు స‌ర్దిచెప్పుకోవ‌డం చాలా క‌ష్టంగానే ఉంటోంది. త‌న సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు అన్న చిరు వ‌చ్చినా ప‌వ‌న్ మాత్రం చిరు సినిమా ఫంక్ష‌న్‌కు రాలేదు. ఇక చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లికి కూడా ప‌వ‌న్ రాలేదు. ఇక రాజ‌కీయంగా కూడా అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ వేర్వేరు రూట్ల‌లో వెళుతుండ‌డంతో పాటు మెగా ఫంక్ష‌న్ల‌కు ప‌వ‌న్ రాక‌పోవ‌డం వెన‌క ఫ్యాన్స్‌లో కాస్త గ్యాప్ అయితే ఉంది.