కాకినాడ కోట లో పవన్ పాగా... వ్యూహం.. ఫలిస్తుందా..     2018-08-16   11:35:41  IST  Bhanu C

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి..రాజకీయ వ్యుహకర్తల మెదడులకి పదును పెరుగుతోంది..ఎవరికి వారు ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ సామాజిక వర్గాలని ,సంఘాలని ప్రసన్నం చేసుకుంటూ దూసుకు పోతున్నారు దీంట్లో తెలుగుదేశం ,వైసీపీలో సక్సెస్ అవుతూ వచ్చాయి అయితే కుల సమీకరణలు చేయను అని చెప్తూ వస్తున్న జనసేనాని సైతం..ఆ దిశగా అడుగులు వేయక తప్పదని అందరికీ తెలిసిందే అయితే కాపు వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాలుగా పేరున్న ఉభయగోదావరి జిల్లాలు అయిన పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు..ఈ క్రమంలోనే

Kapu Reservation,Mudragada,Pawan Kalyan,pawan Kalyan Election Campaign,pawan Kalyan Wants To Stay At Kakinada For Election Campaign

పవన్ కళ్యాణ్ ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు..కాపుల ఓట్లు సునాయాసంగా పడేలా కాపు వర్గాలని ఆకర్షించేలా ఆ సామాజిక వర్గం ఎక్కువగా ప్రభావం చూపే నియోజకవర్గాలలో కీలకమైన వ్యక్తులని నిలబెట్టాలని పవన్ ఆలోచన చేస్తున్నాడు అందులో భాగంగానే..కాపుల కంచుకోట అయిన కాకినాడ నుంచీ మెగా బ్రదర్ నాగబాబు ని రంగంలోకి దించనున్నాడని తెలుస్తోంది అయితే నాగబాబు పోటీ నిలబడేది ఎంపీ సీటు కోసమా లేక ఎమ్మెల్యే సీతుకోసమా అనేది ఇంకా తెలియరాలేదు…సరే ఇది అందరికీ తెలిసిన విషయమే

అయితే పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గం ఉన్న ప్రాంతాలలో పాగా వేయాలని అనుకుంటున్నాడు బాగానే ఉంది కానీ కాపులు ఎంతవరకూ పవన్ కి మద్దతు ఇస్తారు..? తెలుగుదేశానికి ఉన్న కాపుల మద్దతు ఉండనే ఉంది..జగన్ కూడా కాపుల పై వరాల జల్లు కురిపిస్తూనే ఉన్నాడు మరి ఈ తరుణంలో పవన్ ఎలా ముందడుగు వేయబోతున్నాడు అనే విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో కాపుల మద్దతు కూడగట్టుకుంటున్నాడు అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్ త్వరలో ముద్రగడని జనసేనలోకి ఆహ్వానించి పూర్తిస్థాయిలో గోదావరి జిల్లాలల కాపుల కోటలని ని కొల్లగొట్టాలని చూస్తున్నాడు..

Kapu Reservation,Mudragada,Pawan Kalyan,pawan Kalyan Election Campaign,pawan Kalyan Wants To Stay At Kakinada For Election Campaign

అందులో భాగంగానే ముద్రగడ తో ఆత్మీయ సమ్మేళనం పేరుతో జిల్లాలోని ప్రతీ మండలాన్ని టచ్ చేసుకుంటూ చంద్రబాబు పై వ్యతిరేక పవనాలు వీచేలా ఎక్కడికక్కడ కాపులని టీడీపీ కి వ్యతిరేకంగా మారుస్తున్నారు..ఎలాగో జగన్ కి కాపుల ఓటింగ్ శాతం తక్కువ..దాంతో ముద్రగడ పవన్ లు ఇద్దరు కలిసి వచ్చే ఎన్నికల్లోగా కాపులని సందిగ్ధం చేసి ఎన్నికల్లో ఓటింగ్ సరళిని మార్చాలనేది వారి ప్రణాళికగా అర్థం అవుతోంది..అయితే ఈ వ్యవహారం అంతా చాపకింద నీరులా చెకచెకా చేసుకుంటూ వెళ్తున్నారని టాక్ వినిపిస్తోంది ఏది ఏమైనా పవన్ ఏపీ రాజకీయాల్లో ఒక ప్రభంజనం సృష్టిస్తాడని మాత్రం స్పష్టం అవుతోందని అంటున్నారు విశ్లేషకులు. మరి పవన్ వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే..