ఏపీ ప్రజలని తప్పుదోవ... ఆంథ్రాక్స్ పేరిట పిట్టకధ..ఇదేమి రాజకీయం పవనూ!!     2018-06-28   23:45:46  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఉత్తరాంధ్ర రాజకీయాలమీద దృష్టి సారించారు..ఇక్కడి ప్రజలకి ఏమి జరిగినా నేను ఊరుకోను చొక్కా పట్టుకుని లాగుతా అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.. ఉత్తరాంధ్ర వాళ్ళు వలసలు వెళ్లి పోతున్నారు వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..వారు అలా వెళ్ళడానికి ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీలోని ఉత్తరాంధ్ర నాయకులు అని అర్థం అవుతోంది అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు..ఈ వ్యాఖ్యలతో పెద్ద ఉద్యమమే రేపెలా ఉన్నారని నిఘావర్గాల అంచనా అయితే ప్రజలు అందరూ మూకుమ్మడిగా కదిలి రావాలి అంటే..

వారిలో అభద్రతా భావం కలిగించాలి..వారిలో ప్రాణ భీతి..భవిష్యత్తుపై బెంగ గనుకా కలిగితే తప్పకుండా వారు పవన్ తో జట్టు కట్టడానికి సిద్దం అవుతారు..అందుకే జనసేన అధికారంలోకి వస్తే వలస కూలీలని మళ్ళీ ఉత్తరాంధ్ర రప్పిస్తాము ఒక హెక్టార్ భూమిని ఇస్తాను అంటూ వాగ్దానాలు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంతేకాదు ఉత్తరాంధ్ర లో ఒక బలమైన ఉద్యమాన్ని రేపడానికి పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఉద్యమాన్ని రేపాలి అంటే ఏజెన్సీ ప్రజల మద్దతు ఎంతో అవసరం..అయితే వారి మద్దతు ఎలా కూడగట్టాలి..? వారిని ఎలా సమాయుత్తం చేయాలి..? అంటే దానికి పవన్ కళ్యాణ్ ఓ వ్యూహాన్ని రచించారు..అందులో భాగంగానే వారిని భయబ్రాంతులకి గురిచేసేలా..ట్విట్టర్ లో పిట్ట కధ పోస్ట్ చేశారు.

ఈ పిట్ట కధలో ఎన్నో అబద్దాలు..మరెన్నో ఆలోపణలు…నేను చదివింది ఇంటర్ ఫెయిల్ కానీ ప్రపంచాన్ని చదివేశాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారికి ఆంథ్రాక్స్ గురించి కనీస అవగాహన లేకుండా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టడం ఎంతవరకూ సబబు..తమ రాజకీయాల కోసం ఏజెన్సీ ప్రజలని భయబ్రాంతులకి గురించేయడం ఎంతవరకూ సమంజసం..? పోలిటిక్స్ లో క్లీన్ రాజకీయాలు చేస్తానని చెప్పే పవన్ ఇలాంటి రాజకీయాలు చేయడం ఎంతో దారుణమైన విషయం..ఇంతకీ పవన్ కళ్యాణ్ పోస్ట్ యోక్క్ సారాంశం ఏమిటంటే..