Pawan Kalyan to Supports TDP For Nandyal Elections

నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ మ‌ధ్య హోరాహోరీగా ప్ర‌చారం సాగుతోంది. గెలుపుపై రెండు పార్టీలు ధీమాగా ఉండ‌డంతో నంద్యాల ఓట‌రు ఎటువైపు మొగ్గు చూపుతాడ‌న్న‌ది మాత్రం ఎవ్వ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. టీడీపీ ఇక్క‌డ ఇప్ప‌టికే ఆరుగురు మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేల‌ను రంగంలోకి దించితే, వైసీపీ కూడా తామేం త‌క్కువ తిన్నామా ? అంటూ 14 మంది ఎమ్మెల్యేల‌ను ఇక్క‌డ బాధ్యులుగా దింపింది. ఆగ‌స్టు 23న ఉప ఎన్నిక‌, 28న కౌంటింగ్ జ‌ర‌గ‌నున్నాయి.

ఇదిలా ఉంటే గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టీడీపీ+బీజేపీ కూట‌మికి స‌పోర్ట్‌గా ప్ర‌చారం చేశాడు. ఆ త‌ర్వాత కేంద్రం ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోసం చేయ‌డంతో ప‌వ‌న్ బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. కేంద్రం ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చుతూ దారుణంగా ఏకేశాడు. ఇక ఇక్క‌డ టీడీపీని కూడా బీజేపీ రేంజ్‌లో కాకపోయినా లైట్‌గా ఏకేశాడు.