జనసేనాని ధైర్యం ఏంటి ..? ఎందుకా ప్రకటనలు ..?  

కానీ ఈ ప్రకటన వామపక్ష పార్టీలకు మింగుడుపడడం లేదు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో జనసేన పొత్తు ఉంటుందని ఇప్పటివరకు అంతా భావించారు. కానీ అనూహ్యంగా పవన్ ఈ ప్రకటన చేయడంతో వామపక్ష పార్టీలు గుర్రుగా ఉన్నాయి. నిన్నటివరకు పవన్ తో కలిసి తిరిగిన వామపక్ష పార్టీల నేతలు ఈ పరిణామంతో దూరంగా జరుగుతున్నారు. జనసేన పార్టీకి ఇప్పటివరకు సంస్థాగత నిర్మాణం లేదు పార్టీకి అభ్యర్థులు లేరు అసలు పార్టీకి ఎన్నికల సంఘం ఇంకా గుర్తే ఇవ్వలేదు… వీటన్నింటినీ పక్కనపెట్టేసి ఎన్నికల్లో పోటీపై పవన్ చేస్తున్న ప్రకటనలు నిజంగానే ఆసక్తిని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

పవన్ చెప్పినట్లుగానే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ – 25 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీకి దిగుతుంది అనుకున్నా పోటీ చేసి గెలిచే స్థాయి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు అనేది పార్టీలోనే చర్చ జరుగుతోంది. పార్టీ నిర్మాణం మీద పవన్ దృష్టి పెట్టకుండా ఎన్నికల్లో పోటీ గురించి పవన్ పగటి కలలు కంటున్నట్టుగా ఉంది .ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులు ఫ్యాన్స్ ని, జనసేన కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి.