పవన్ పై చంద్రబాబు నిఘా..తిప్పికొట్టిన పవన్ కళ్యాణ్     2018-04-19   02:07:34  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ని వెనక్కి పంపేశారు..మాకు ప్రభుత్వం నుంఛీ ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు అంటూ సున్నితంగా తిరస్కరిచారు..అదేంటి మాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పి మరీ ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు కదా మరి ఇలా ఒక్కసారిగా ఎందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే దానికి పెద్ద స్టోరీనే ఉంది ఇంతకీ అసలేమి జరిగింది..ఎందుకు పవన్ ప్రభుత్వ సెక్యూరిటీ వద్దు అని చెప్పారు అనే వివరాలలోకి వెళ్తే..

చంద్రబాబు పై ఎంతో గౌరవం ఉంది ఆయన ముందు చూపు ఏందో ఆదర్సవంతం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఒక్క సారిగా ఎందుకు చంద్రబాబు విషయంలో యూ టర్న్ తీసుకున్నారో మోడీ కే తెలియాలి సరే ఆ విషయం పక్కన పెడితే..పవన్ చంద్రబాబు లోకేష్ ల పై చేసిన అవినీతి ఆరోపణలు ఎంత సంచలనం కలిగించాయో అందరికీ తెలిసిందే అయితే గుంటూరు వేదికగా తండ్రి కొడుకులని దుమ్ము దులిపేశాడు పవన్ అంతేకాదు ఆ తరువాత జనసేన పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ మాతో సుమారు 40 మంది టిడిపి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అంటూ ప్రకటన చేశారు..