నేను యాత్రలు చేస్తుంటే .. మీరు విహారయాత్రలు చేస్తున్నారా ..? కోర్ కమిటీపై పవన్ గుర్రు     2018-06-15   01:00:39  IST  Bhanu C

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కోపం వచ్చింది. పార్టీ పరిస్థితి చూస్తే ఇంకా సరిగ్గా పట్టాలే ఎక్కలేదు ! ఒక వైపు జనాల్లో పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చేందుకు నేను ఎండనక వాననకా జనాల్లో తిరుగుతుంటే అవేవి మీకు పట్టనట్టు తిరుగుతారా ..? ఇదేనా మీకు ఉన్న కమిట్మెంట్ అంటూ జనసేన అధ్యక్షు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కోర్ కమిటీ మీద గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన పార్టీలో ఒకరిద్దరి దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

పార్టీ మీటింగ్స్ లో నాయకులూ అంతా … తాము చావుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ ప్రతిజ్ఞలు చేసి, తీరా జనాల్లోకి వెళ్లేసరికి ఒక్కడూ కనిపించకపోవడంతో, పవన్ కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని దక్కించుకున్న తోట చంద్రశేఖర్ ఆ పదవి వచ్చిన రోజు తప్ప మళ్లీ కనిపించలేదట. ఉత్తరాంధ్రలో ఎండ, వాన అని చూడకుండా పవన్ తిరుగుతుంటే, జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్ హైదరాబాద్ లో కూర్చుని సీట్లకు బేరసారాలు చేసినట్లు
సమాచారం.