ప‌వ‌న్ మ‌ళ్లీ ట్వీటాడు.. వివాద‌మా? ప్ర‌కంప‌న‌మా?     2018-06-22   00:04:23  IST  Bhanu C

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌ళ్లీ ట్వీట్లు చేయ‌డం ప్రారంభించాడు. అప్పుడెప్పుడో.. న‌టి శ్రీరెడ్డి ఉదంతం త‌ర్వాత మౌనం వ‌హించిన ఈ ప‌వ‌ర్ స్టార్‌.. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై స్పందించాడు. అయితే, ఈయ‌న స్పంద‌న‌లు అన్నీ కూడా.,. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెల్ల‌కు అన్న సామెత‌ను గుర్తుకు తెస్తున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం పోరుయాత్రలో భాగంగా శ్రీకాకుళంలో ప‌ర్య‌టిస్త‌న్న ప‌వ‌న్‌.. రంజాన్‌కు ముందు నుంచి విరామం ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికీ యాత్ర ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో వెల్ల‌డించ‌లేదు. ఇదిలావుంటే, తాజాగా ఆయ‌న రాష్ట్రంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై స్పందించాడు. అయితే, ఆయ‌న చేసిన ట్వీట్ల‌లో చాలా వ‌ర‌కు గ‌తంలో నాకు అది తెలిసింది.. ఇది తెలిసింది.. అన్న‌ట్టుగా మూస విధానంలోనే సాగ‌డం గ‌మ‌నార్హం.

కొన్నాళ్ల కింద‌ట రాష్ట్రంలో తిరుమ‌ల తిరుప‌తి వివాదం తీవ్రంగా కుదిపేసింది. ప్ర‌ధాన అర్చకుడు ర‌మ‌ణ దీక్షితుల‌ను తొల‌గించ‌డం.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు.. తీవ్ర‌స్థాయిలో వివాదం రేపాయి. అయితే, అప్ప‌ట్లో మాట్లాడ‌ని జ‌న‌సేనాని.. అంతా అయిపోయింద‌ని అంద‌రూ అనుకుంటున్న నేప‌థ్యంలో నోరు తెరిచారు. కొన్నాళ్ళ క్రితం ఓ ఉన్నతాధికారి, టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై తనతో చర్చించారని పవన్‌కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఆ చర్చల సారాంశాన్నితాజాగా ట్వీట్ చేశాడు. ప్రత్యేక విమానం ద్వారా వెంకటేశ్వరస్వామికి చెందిన విలువైన సంపద విదేశాలకు తరలించబడిందని, ఆ విషయం ఆ ఉన్నతాధికారి పవన్‌కళ్యాణ్‌ చెవిన వేశారని పేర్కొన్నాడు.