పవన్ రీల్ హీరో .. జగన్ రియల్ హీరో ! ఇదిగో సాక్ష్యం !     2018-05-26   02:43:39  IST  Bhanu C

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు .. జగన్ చేస్తున్న పాదయాత్ర చూసి అతడికి వస్తున్న ప్రజాధారణ తనకు కూడా రావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా నుంచి పాదయాత్ర చేపట్టాడు. అయితే.. తెర మీద జీవితానికి .. తెర వెనుక జీవితానికి చాలా తేడా ఉంటుంది అని … రాజకీయం అంటే రెండు స్టెప్పులు వేసి .. రెండుగంటలు రెస్ట్ తీసుకోవడం కాదని ఇప్పుడు పవన్ కి బాగా తెలిసొచ్చింది. పాదయాత్ర చేస్తే .. కాళ్ళు మండుతాయి.. ఒళ్ళు హూనం అవుతుంది. ఓపిక అంతా పోతుంది. అయినా దృఢమైన సంకల్పం ఉంటే… ఇవన్నీ చిన్న చిన్న సమస్యల్లాగానే కనిపిస్తాయి.

ఇప్పుడు జగన్ – పవన్ యాత్రలకు ఉన్న తేడా చూసుకుంటే… పవన్ తెరపైన మాత్రమే హీరో..రియల్ లైఫ్‌లో మాత్రం జీరో అని నిరూపించేసుకుంటున్నాడు. అంతెందుకు మొన్నామధ్య కాలి నడకన తిరుమల కొండ ఎక్కినప్పుడు కూడా పవన్ శారీరక సామర్థ్యం ఏంటో అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు పోరాటయాత్ర పట్టుమని నాలుగురోజులు చేసాడో లేదో అప్పుడే కుంటిసాకులు చెప్తూ వాయిదా వేసేశాడు.