పవన్ 'పవర్' సరిపోవడంలేదా ..? ఇంకా రాజకీయ క్లారిటీ రాలేదా ..?     2018-06-22   03:40:34  IST  Bhanu C

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టినా పవన్ కళ్యాణ్ లో ఇంకా రాజకీయ క్లారిటీ రాలేదనిపిస్తోంది. పార్ట్ టైం పొలిటీషియన్ అనే ముద్ర వేయించుకున్న ఆయన ఇంకా ఆ ముద్ర చెరుపుకునే ప్రయత్నం అయితే చేయడంలేదు. పైగా ఏపీలో 175 నియోజకవర్గాల్లోనూ తాను పోటీ చేస్తానని ధీమాగా ప్రకటించేశాడు. అయితే ఆ మేరకు మాత్రం ఎక్కడా కృషి చేస్తున్నట్టు కనిపించడంలేదు.

సంస్థాగతంగా ఇప్పటి వరకు జిల్లా స్థాయిల్లో పూర్తి స్థాయి కమిటీలు ఏర్పరచకపోవడం, గ్రాస్ రూట్, బూత్ స్థాయి కమిటీలు లేకపోవటం, కేవలం తన అభిమానులపైనే పవన్ కల్యాణ్ ఆధారపడడం వంటివి ప్రస్తుత రాజకీయాల్లో మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, పార్టీ ప్రచారం, ఓటర్లతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు మమేకమవడం వంటి కార్యక్రమాల్లో ఆ పార్టీ బిజీగా ఉంది. చాపకింద నీరులా టీడీపీ ఎన్నికల్లో ఓట్లు దండుకునే కార్యక్రమంలో వైసీపీ కన్నా ముందుంది.