పవన్‌ ఎఫెక్ట్‌ నుండి బయట పడేనా?     2018-06-21   03:45:53  IST  Raghu V

పవన్‌ కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌ తర్వాత సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ను సంపత్‌ నంది దర్శకత్వంలో చేయానుకున్నాడు. దాదాపు సంవత్సర కాలం పాటు వెయిట్‌ చేయించి సంపత్‌కు మొండి చేయి చూపించాడు. సంవత్సరంపాటు మరే ఇతర సినిమాలకు కమిట్‌ కాకుండా ఉన్న దర్శకుడు సంపత్‌ నంది, పవన్‌ నో చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక కొన్నాళ్ల తర్వాత రవితేజతో సినిమా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది, ఆ విషయం పక్కన పెడితే పవన్‌ వల్ల నష్టపోయింది కేవలం సంపత్‌ నంది మాత్రమే కాదని, ఆయన వల్ల తెలుగు అమ్మాయి అనీషా ఆంబ్రోస్‌ కూడా నష్టపోయిన విషయం అందరికి తెల్సిందే.

సర్దార్‌ చిత్రంలో అనీషా ఆంబ్రోస్‌ను హీరోయిన్‌గా అనుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఆ తర్వాత తెలుగు అమ్మాయితో రొమాన్స్‌ తన వల్ల కాదని తేల్చి చెప్పాడు. పవన్‌ కళ్యాణ్‌తో చేస్తున్న సినిమాకు అనీష ఆంబ్రోస్‌ భారీగా డేట్లు కేటాయించింది. తీరా ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది, అనీషాను తప్పించారు. పవన్‌తో మూవీ అనుకుని చాలా సినిమాలకు అనీషా ఆంబ్రోస్‌ నో చెప్పింది. ఆ ప్రభావం వల్ల ఇంకా కూడా ఈ అమ్మడు కోలుకోలేక పోయింది. పవన్‌ కాదన్న తర్వాత ఈమె మళ్లీ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేసింది. కాని ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అయినా కూడా ప్రయత్నాలు మానేయలేదు.