పవన్ కి క్లారిటీ మిస్..సతమతమవుతున్న జనసేనాని     2018-06-30   00:53:49  IST  Bhanu C

గత ఏడాది ఎన్నికల సమయంలో పెట్టిన జనసేన పార్టీ అప్పట్లో ఎలాంటి క్లారిటీ తో పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఇప్పటికీ అదేవిధమైన మైండ్ సెట్ తో ఉన్నాడని తెలుస్తోంది..స్టేజీ ఎక్కి ఎదో నాలుగు మాటలు మాట్లాడటం.. కుర్రాళ్ళు హుషారు గా ఉండటానికి గొంతు పోయేలా మరో రెండు అరుపులు అరవడం ఇది పరిపాటి అయ్యింది. అప్పటికి ఇప్పటికే ఉన్న తేడా ఒక్కటే అప్పుడు తెలుగుదేశం పార్టీ తో దోస్తీ కడితే ఇప్పుడు పవన్ ప్రత్యక్ష ఎన్నికలకి సిద్దం అవుతూ వామపక్షాలతో జట్టు కడుతున్నాడు…అయితే

జనసేనాని ఈ మధ్య కొంచం దూకుడుగానే వెళ్తున్నట్లుగా అనిపించినా ఎక్క‌డో ఏదో తేడా కొడుతుంద‌నే ఆలోచ‌న మాత్రం ప‌వ‌న్‌ను వెంటాడుతుంద‌ట‌. అయితే ఏదీ అనేదానిపై ఇప్ప‌టికైతే క్లారిటీ రాలేద‌ట‌. గ‌త‌నెల‌లో ఉత్త‌రాంధ్ర నుంచి ప‌ర్య‌ట‌నకు శ్రీకారం చుట్టిన ప‌వ‌ర్‌స్టార్ జ‌నాల్లోకి బాగానే చేర‌గ‌లిగారు…అయితే అదే స‌మ‌యంలో ఎమోష‌న‌ల్‌గా కూడా జ‌నాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్రను వేయించుకోగ‌లిగారు…తన సభలకి సైతం భారీ స్థాయిలో జనాలు కూడా వస్తున్నారు..కాని వాటిని ఓట్లుగా మలుచుకోగాలరా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి..