పవన్‌ కళ్యాణ్‌ ‘మా’ ప్రెసిడెంట్‌.. నీబొంద ర నీ బోంద!!     2018-04-28   04:17:34  IST  Raghu V

గత కొన్ని రోజులుగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వారిపై మీడియాలో వస్తున్న కథనాలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి, పవన్‌ కళ్యాణ్‌లు ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక వర్మ ఉన్న విషయమై పవన్‌ కళ్యాణ్‌ చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో దాదాపు అయిదు గంటల పాటు తన నిరసన తెలియజేయడం జరిగింది. ఆ సమయంలోనే సినిమా పరిశ్రమ వారు ఎవరి దారిన వారు ఉంటున్నారని, కలిసి కట్టుగా ఉండక పోవడం వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది అంటూ పవన్‌ అభిప్రాయపడ్డాడు.

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌పై తీవ్ర స్థాయిలో పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడనే పుకార్లు కూడా షికారు చేశాయి. మా వారు తీసుకున్న అనాలోచిత నిర్ణయం మరియు మాలో కొనసాగుతున్న ఏకపక్ష వైఖరి కారణంగానే నేడు ఈ పరిస్థితి దాపరించిందని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ మా అధ్యక్షుడితో ఆగ్రహంగా అన్నట్లుగా తెలుస్తోంది. మా వ్యవహార శైలిపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో పవన్‌ కళ్యాణ్‌ త్వరలో మా ప్రెసిడెంట్‌ అవ్వబోతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.