నాకు కొన్నేళ్ళ క్రిత్రమే తెలుసు..శ్రీవారి ఆభరణాల మాయంపై...పవన్     2018-06-21   04:10:06  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వం పై మరోమారు విమర్సనాస్త్రాలు ఎక్కుపెట్టారు..గతకొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల పై ఆయన స్పందించారు..రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలకి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఇదేనా..? మీ సంధానం ఏపీ ప్రజలకి సంతృప్తి కరంగా లేదు అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు..ఎంతో సెంటిమెంట్ తో కూడుకున్న తిరుమల కొండపై జరుగుతున్న ఘోరాలకి మీరు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసునని అన్నారు..

ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించిన పవన్ కళ్యాణ్ మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..ఓ భక్తుడు కాయిన్స్ విసరడం వల్ల గులాబీరంగు వజ్రం ముక్కలు కావడంపై, అది మాయం కావడంపై ఫోరెన్సిక్ నిపుణులతో సీన్ రిక్రియేట్ చేయలేమా అని ప్రశ్నించారు..అప్పుడు వాస్తవం బయటకియా వస్తుంది కదా అని అన్నారు..అంతేకాదు ఆభరణాల మాయం విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో గుబులు రేపుతున్నాయి..