Katamarayudu inside talk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మరోకొన్ని రోజుల్లో ఉగాది కానుకగా తెలుగు ప్రేక్షకులని అలరించటానికి రానుంది. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో అజిత్ నటించిన వీరమ్ అనే చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ చిత్రంలో తమన్నా పోషించిన పాత్రను ఇందులో శృతిహాసన్ పోషిస్తుండగా, శివబాలాజీ ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. కాటమరాయుడు శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కింది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టాక్ విషయానికి వస్తే, సినిమా యావరేజ్ గా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పవర్ స్టార్ మెనరిజమ్స్, ట్రైన్ ఫైట్ మాస్ ప్రేక్షకులని విపరీతంగా అలరించం ఖాయం. శృతి ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తుండటంతో యువత థియేటర్ల ముందు వాలిపోతుంది. ఫ్యామిలి ఆడియెన్స్ కి కావాల్సిన ఆంశాలు కూడా ఉండటం, పల్లె వాతావరణం ఉన్న సినిమా కావడం, ఉగాది సీజన్, వేసవి సెలవులు, పోటీలో పెద్ద సినిమాలు లేకపోవడం, ఈ ఆంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కాటమరాయుడు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అనిపిస్తోంది.

కథ, కథనాల మీద సినిమా యావరేజ్ అయినా, ఓ పెద్ద హీరో సినిమా సెలవుల్లో వస్తోంటే, అంతకన్నా ఇంకేం కావాలి. గత ఏడాది వేసవి సెలవుల్లో వచ్చిన సరైనోడు కూడా యావరేజ్ టాక్ తోనే భారి కలెక్షన్లు సాధించింది. అందుకే, కాటమరాయుడుపై పంపిణీదారులు బాగా ఆశలు పెట్టుకున్నారు. మేం చెప్పిన యావరేజ్ టాక్ నిజమైతే, ఈ సినిమా ఎంత లేదన్నా 75-85 కోట్ల దాకా షేర్ వసూళ్ళు సాధించవచ్చు. కాని, బిజినెస్ పరంగా ఈ సినిమా లాభాల్లో పడాలంటే, అంతకుమించి సంపాదించాలి.