జనసేనానిలో ఊపు తగ్గిందా ..? వాయిదాల యాత్ర కొనసాగేనా ..?     2018-06-20   01:54:48  IST  Bhanu C

రాజకీయాలంటే సినిమాల్లో చూపించినంత ఈజీ కాదు. ఒకటి రెండు సీన్లలో నటించి రెస్ట్ తీసుకోవడం అంతకన్నా కాదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయం అని అయన అభిమానులు హడావుడి చేస్తుంటే.. పవన్ మాత్రం తన రొటీన్ వ్యవహారశైలితో అందరిలోనూ అసహనాన్ని కలిగిస్తున్నాడు. ఇటీవల పవన్ చేపట్టిన యాత్ర కూడా సక్రమంగా జరగకపోవడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ కలుగుతోంది. రంజాన్ సెలవలు అంటూ యాత్రకు బ్రేక్ చెప్పిన ఆయన ఆ తరువాత అనారోగ్యం సాకు చూపించి రెస్ట్ తీసుకుంటున్నాడు.

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్ని చుట్టేసిన పవన్‌కళ్యాణ్‌, విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తూ, రంజాన్‌ సెలవులు తీసుకున్నారు. మళ్ళీ యాత్ర ప్రారంభించేది ఎప్పుడో మాత్రం తెలియడంలేదు. కంటి చూపు సమస్యతో పవన్‌ బాధపడుతున్నారని అందుకే యాత్ర ఆలస్యం అవుతోందని దీనికి తోడు పవన్‌కళ్యాణ్‌కి వెన్ను నొప్పి సమస్యలు ఉన్నాయని అందుకే పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారని జనసేన వర్గాలు చెప్తున్నాయి.