Pawan Kalyan is not equal to Prabhas’s feet – RGV

బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ అంటే ఒక ఇండియన్ బడా స్టార్. కేవలం తెలుగు స్టార్ హీరో మాత్రమే కాదు. గొప్పగా ఫీల్ అవాల్సిన విషయం ఏమిటంటే, ఐదారు హాలివుడ్ వెబ్ సైట్లు కూడా నిన్న విడుదలైన బాహుబలి 2 ట్రైలర్ గురించి రాసాయి. ఇక అర్థం చేసుకోండి మీరే, బాహుబలి, రాజమౌళి, ప్రభాస్ ల పేర్లు ఎక్కడిదాకా వినబడుతున్నాయో.

ఇదిలా ఉంటే, రామ్ గోపాల్ వర్మ బాహుబలి ట్రైలర్ ని, ప్రభాస్ ని తెగ పొగిడేసారు. పొగిడితే పొగిడారు కాని, మళ్ళీ పవర్ స్టార్ మీద మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేసారు. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో విడుదలై, అక్కడకూడా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సంగతిని ప్రస్తావిస్తూ “బాహుబలి ట్రైలర్ కి ప్రపంచమంతా జై కొడుతుంటే, టాలివుడ్ మాత్రం సూపర్ సైలెంట్ గా ఉండటానికి కారణం కుళ్ళు సముద్రంలో మినిగిపోవటం ములాన. టాలివుడ్ పవర్ ఫుల్ స్టార్లు (పవన్) నేషనల్ గా ట్రై చేసి, ఘోరంగా ఫేయిల్ అయ్యి మళ్ళీ రీజనల్ అయిపోయారు. బాహుబలి 2 తరువాత టాలివుడ్ లో పవర్ ఫులెస్ట్ మెగాసూపర్ స్టార్లందరు ప్రభాస్ కాలిగోటిని అందుకోవడానికి రెండున్నర జన్మలు పడుతుంది ” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసారు వర్మ.

మరి ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తారా? రామ్ చరణ్, చిరంజీవి స్పందిస్తారా? లేక డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేస్తారా? ప్రస్తుతానికైతే ట్విట్టర్ లో మెగా ఫ్యాన్స్ వర్మని బూతులు తిట్టుకుంటున్నారు.