జనసేనలో టాలీవుడ్ ప్రముఖులు..లిస్ట్ ఇదే    2017-10-31   06:20:27  IST 

జనసేన ఇంకా జనంలోకి పూర్తీ స్థాయిలో రాలేదు కానీ అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ పూర్తీ స్థాయి రాజకీయాల్లోకి వస్తారని చెప్తున్నారు ఆ పార్టీ వర్గాలు..ఇప్పటి వరకు పార్టీమీద నమ్మకం కూస్తో కాస్తో ఉందంటే అది కేవలం అప్పుడప్పుడు పవన్ ప్రజా సమస్యలపై మాట్లాడటం వల్లనే. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా చేస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంద లేదా.. ఏదన్నా పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఎన్ని సీట్ల‌లో పోటీ చేస్తుంద‌న్న‌దానిపై అయితే ఇప్ప‌టికే ఓ క్లారిటీ వ‌చ్చేసింది.

ప‌వ‌న్ పార్టీ ఏపీ, తెలంగాణ‌లో క‌లిపి 175 సీట్ల‌లో పోటీ చేస్తుంద‌ని జ‌న‌సేన నుంచే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. జనసేన కి బలమైన చోట్ల మాత్రమే పోటీ పెట్టాలని భావిస్తోంది. గతంలో చిరు ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు అన్ని ఎమ్మెల్యే స్థానాల‌తో పాటు ఎంపీ సీట్ల‌లో పోటీ చేసి చాలా సీట్ల‌లో డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక‌పోయింది.ఇప్పుడు తన పరిస్థితి అలా ఉండకూడదు అని భావిస్తున్నాడట పవన్.