“పవన్ దీక్ష”..రేపు కీలక ప్రకటన..    2018-04-03   05:40:59  IST  Bhanu C

గుంటూరు సభలో గొంతు చించుకుని మరీ చంద్రబాబు ప్రభుత్వంపై ,కేంద్రం పై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ అదే వేదికగా ఒక కీలక ప్రకటన కూడా చేశారు..ఆంధ్రప్రదేశ్ కోసం తన ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించిన పొట్టిశ్రీరాములు నాకు స్పూర్తి..ఏపీ హక్కుల కోసం , ప్రత్యేక హోదా సాధన కోసం నా ప్రాణాలు బలి ఇవ్వడానికైనా సరే నేను సిద్దంగా ఉన్నాను అంటూ పవన్ అన్న మాటలు అందరికీ బాగా గుర్తు ఉండే ఉంటుంది..అదేదో సినిమా డైలాగు అనుకున్నారు అందరూ..అయితే ఇప్పుడు పవన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి తన ప్రాణాలను పణంగా ఒడ్డి పోరాడడానికి నిర్ణయించుకున్నారు…ఇదేందో సరదాగా రెండు రోజులు చేసి ఒక గ్లాసు నిమ్మరసం ఇస్తే తాగేసే దీక్ష కాదు అంటూ సంకేతాలు ఇచ్చారు…తన పోరాట పటిమను మరింత ఘనంగా బయటపెట్టే లాగా ఆయన దీక్షకు పూనుకోవాలని అనుకుంటున్నారు.

అయితే ఈ నిరాహార దీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా బుధవారం నాడు విజయవాడలో పవన్ కళ్యాణ్ స్వయంగా చేస్తారని అంటున్నారు..ఇదిలాఉంటే గురువారం పవన్ విజయవాడలోనే పర్యటించనున్నారు. బుధవారం తన జనసేన కూటమిలో భాగస్వాములుగా వుండే వామపక్షాల నాయకులు మరికొందరు పార్టీ సీనియర్లతో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే పోరాటానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి ఆ భేటీలో చర్చిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్షకు సరైన సమయంలో సరైన వేదిక గురించి కూడా ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని…తాను ఢిల్లీ వెళ్లనని రాష్ట్రంలోనే దీక్షకు కూర్చోవడం ద్వారా ఢిల్లీని గడగడలాడిస్తానని పవన్ కళ్యాణ్ గుంటూరు సభలోనే వెల్లడించారు.

ఒక పక్క అధికార పక్షం అయిన టిడిపి, మరో పక్క ప్రతిపక్షం అయిన వైసీపి వారికి వారు తగ్గట్టుగా దీక్షలు చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో తాను కూడా ఆమరణ నిరాహారా దీక్ష వంటిది ఏదైనా చేయాలని అది కూడా అన్ని పార్టీలులా కాకుండా ఎంతో దృఢ నిశ్చయంతో చేయనునారని తెలుస్తోంది..అందుకే కొంత కాలం ఆగి దీక్షని చేద్దామని అనుకున్న పవన్ కళ్యాణ్ కోరికని కొంచం ముందుగానే చేయనున్నట్లుగా తెలుస్తోంది…అయితే పవన్ ఈ దీక్షని అమరావతిలో చేస్తారా లేదా విజయవాడ నగరం నడి బొడ్డున చేస్తారా అనేది జనసేన కీలక నేతలతో చర్చించిన తరువాతనే ప్రకటిస్తారు అని తెలుస్తోంది..అయితే గతంలో పవన్ దీక్ష చేస్తే చంపేస్తారు వద్దు అంటూ పోసాని అన్న మాటలపై కూడా జనసేన నేతలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది..మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ దీక్షతో పార్టీ మైలేజ్ ని పెంచనున్నారు అనేమాట వాస్తవం..