చొక్కాపట్టుకుని లాగుతా .. పవన్ సంచలన వ్యాఖ్యలు.     2018-06-28   00:35:53  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఉత్తరాంధ్ర పై మక్కువ ఎక్కువ అవుతోంది..మొదటినుంచీ కూడా పవన్ అక్కడి వారిపై శ్రద్ధ చూపడానికి అసలు కారణం పాలకులు ఉత్తరాంధ్ర ని విస్మరించడమే..ఉత్తరాంధ్రలో ఉన్న ఎంతో విలువైన సంపదకోసం అక్కడి ప్రజలని నిర్లక్ష్యమ చేస్తున్నారని..పవన్ కళ్యాణ్ అధికార పార్టీ తెలుగుదేశం పై విమర్శలు తీవ్రతరం చేశారు..ఎంతో మంది రైతులు పొలాలని వదిలేసి వలస కూలీలుగా వెళ్లిపోతుంటే ఏమి చేయకుండా నిమ్మకి నీరెత్తి నట్టుగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కావాలనే వారికి ఆ పరిస్థితిని కల్పిస్తోందని ఆరోపణలు చేశారు..

పచ్చటి భూములు..పుష్కలమైన జల వనరులు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తమ స్వార్ధం కోసం పాలకులు కావాలనే నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేశారని..ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న సహజ వనరులు, గనులపై కొందరి దృష్టిపడిందనీ..ఇప్పుడు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు..అందులో భాగంగానే ఇక్కడ బ్రతకలేని పరిస్థితిలు కల్పిస్తున్నారని అన్నారు..మేధావుల కోపానికి కూడా కారణం ఇదేనని అన్నారు.

టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తే ఉత్తరాంధ్ర కి అండగా నిలబడుతారు అని గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చా కానీ వారు ఏకంగా లక్ష ఎకరాలను కబ్జా చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.