పవనూ....నీకు కొంచం క్లారిటీ ఉండాలోయ్..    2018-04-10   00:32:49  IST  Bhanu C

రాజకీయాలు అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు..రాజకీయాల్లో వచ్చిన తరువాత మనం మాట్లాడే, మాట్లాడబోయే మాటలు ఆచి తూచి మాట్లాడాలి..రాజకీయ జీవితంలో మనం వేసే ప్రతీ అడుగు సరిగ్గా ఉండాలి పొరపాటున తప్పటడుగు పడితే అక్కడితో అప్పటివరకూ సంపాదించిన పేరు అంతా ఒక్క సారిగా కొట్టుకు పోతుంది..అయితే దానికి ఉదాహరణకి సరిగ్గా సరిపోయే వ్యక్తి ఏపీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఎంతో క్రేజ్ ఉండేది..తన మాటకి యువకులు నుంచీ ఉద్యోగులు వరకూ తన సామాజిక వర్గం వారు ఇలా తనమీద అభిమానం చూపించే ప్రతీ ఒక్కరు విలువ ఇచ్చే వారు గౌరవించే వారు..


కానీ ఇదంతా ఒకప్పటి మాట..ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అవకాశ వాద రాజకీయాలు చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచీ పవన్ ఇమేజ్ మెల్ల మెల్లగా డ్యామేజ్ అవుతూ వచ్చింది..అయితే ఈ క్రమంలోనే పవన్ పై ఉన్న క్రేజ్ తగ్గుతూ వచ్చింది..తాజాగా పవన్ చేసిన పాదయాత్ర ద్వారా తన స్థాయి మరింతగా తగ్గిపోయింది అని చెప్పవచ్చు..వామపక్షాలు ,జనసేన కలిసి పాదయాత్ర్ర చేసిన విషయం అందరికీ తెలిసిందే..అయితే అసలే వామపక్షాలు కన్ఫ్యూషన్ తో ఉంటాయి దానికి తోడూ ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో తెలియని జనసేన తోడయ్యింది..వెరసి మీడియా మెదడుకు పదును పెట్టే ప్రయత్నం చేశారు..