సైరా మూవీలో పూనం.. పవన్‌ ఆగ్రహం     2018-08-17   09:09:11  IST  Ramesh P

మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మక 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డిలో ఇప్పటికే పలువురు స్టార్స్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ ఇలా అన్ని సినీ పరిశ్రమల నుండి సైరాలో నటిస్తున్నారు. దాంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రకు గాను పూనం కౌర్‌ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈమె హీరోయిన్‌గా చేయకపోయినా కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, సీరియల్స్‌లో నటిస్తూ వస్తున్న ఈమెకు సైరాలో ఛాన్స్‌ దక్కింది.

Pawan Kalyan Fires On Saira Narasimha Reddy Movie Makers,punam Kour,Saira Narasimha Reddy

ఒక కీలకమైన పాత్ర కోసం చిత్ర దర్శకుడు ఆడిషన్స్‌ నిర్వహించాడు అని, ఆ ఆడిషన్స్‌లో పూనం కౌర్‌ ఎంపిక అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పూనం సైరా చిత్రంలో ఎంపిక కావడం పెద్ద విశేషం ఏమీ కాదు. కాని పూనం గత కొంత కాలంగా త్రివిక్రమ్‌ మరియు పవన్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తుంది. త్రివిక్రమ్‌ను నమ్మక ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఈమెను సైరా చిత్రంలోకి తీసుకోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

పవన్‌కు త్రివిక్రమ్‌ ఆప్త మిత్రుడు. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు, ఎవరికి ఉండవు. అలాంటి మిత్రుడి గురించి పదే పదే పూనం కౌర్‌ విమర్శలు చేసింది. ఆ విమర్శలు ఎంతటి వివాదంను రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి కాస్టింగ్‌ కౌచ్‌ విషయమై విమర్శలు చేసిన పూనంకు సైరాలో ఛాన్స్‌ రావడంను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. చిరంజీవి మూవీలో అదీ సైరా వంటి ప్రతిష్టాత్మక మూవీలో పూనంకు ఛాన్స్‌ను ఇవ్వడం తమను అవమానించినట్లే అంటూ కొందరు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్ర యూనిట్‌ సభ్యులపై పవన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Pawan Kalyan Fires On Saira Narasimha Reddy Movie Makers,punam Kour,Saira Narasimha Reddy

పవన్‌ ప్రస్తుతం రాజకీయాతో బిజీగా ఉన్నా కూడా ఈ విషయంలో పట్టించుకునే అవకాశం లేకపోలేదు. సైరా చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ సమయంలో పూనం విషయం ప్రస్తుతం చిత్ర యూనిట్‌ సభ్యుల్లో కలకలంను రేపుతుంది. పూనం ఎంపిక విషయంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమెను తొలగిస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది.