ఇదేంది పవన్....పవన్ పై అభిమానుల ఆగ్రహం    2018-04-05   00:20:41  IST  Bhanu C

“జనసేన పార్టీ” కొత్తగా పుట్టకపోయినా సరే 2019 ఎన్నికల్లో మాత్రం మొదటి సారిగా ప్రత్యక్ష రాజకీయాల బరిలోకి దూకుతోంది..అయితే పవన్ ఒక్క మాట చెప్తే చాలు పార్టీ కార్యక్రమాలని హుటాహుటిన ప్రారంభించి..పార్టీ ని ముందుకు తీసుకువెళ్ల గలిగే ఎంతో మంది యువ రక్తం పవన్ కి వెన్ను దన్నుగా ఉంది..తన సామాజిక వర్గం కానీ ఇతర సామాజిక వర్గ అభిమానులు కానీ ఎవరు ఉన్నా సరే పవన్ కి బాసటగా నిలిచేది అధిక శాతం యువకులే. అయితే పవన్ కూడా వారికి తగ్గట్టుగానే మొదట్లో భీకర అరుపులు..ప్రసంగాలు చేసుకుంటూ జనసేనని బాగానే ప్రజలలోకి తీసుకుని వెళ్ళాడు…అభిమానుల్లో వెయ్యి ఒల్ట్లు కరెంటు నింపాడు కానీ..

ఈ మధ్య కాలంలో చూసుకుంటే..పవన్ నిర్ణయాలు గాని…పార్టీని ముందుకు తీసుకువెళ్ళే విధానం గానీ ఎంతో నెమ్మదిగా ఉంటున్నాయి..వృద్దులు అందరు కలిపి ఒక పార్టీ పెట్టుకున్నారా అనే విమర్శలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..తమకి సత్తా, పోరాట పటిమ పుష్కలంగా ఉన్నాయని నిరూపించుకోవడానికి తహ తహ లాడాల్సిన పార్టీ…ఈసురోమంటూ..ఉంటోంది..ఈ పరిస్థితులని చూసి పార్టీ కార్యకర్తలు.వీరాభిమానులు సైతం ఆశ్చర్య పోతున్నారు.