మాటల్లోనే మానవత్వం .. ఇదే పవన్ తత్వం !  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే అయ్యో పవన్ ఎంత కొప్పవాడు .. గొప్ప సినీ హీరో అయినా మంచి వ్యక్తిత్వం ఉంది కదా అని ఆయన మీద అభిమానం కురిపించే అభిమానులు ఇప్పుడు పవన్ తీరుతో షాక్ తింటున్నారు. సున్నితమైన వ్యక్తిత్వం నాది అని చెప్పుకునే పవన్ లోపల రూపం వేరే ఉందా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది. పవన్ కళ్యాణ్ మీద పీకల్లోతు అభిమానం పెంచుకున్న ఇద్దరు అభిమానులు ఆయన యాత్రకు సంబంధించి ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కి గురై మరణించారు. ఆ ప్రాంతానికి ఒక గంట ప్రయాణ దూరంలోనే ఉన్న పవన్ వారిని పరామర్శిస్తాడని అంతా ఊహించారు. కానీ పవన్ నాలుగు సింపతీ మాటలు చెప్పి యాత్ర ఆ రూట్లో వచ్చినప్పుడు పరామర్శిస్తా అని ప్రకటించాడు.

విశాఖ జిల్లాలో యాత్ర చేస్తున్న పవన్ పాయకరావుపేటలో కూడా యాత్ర షెడ్యూల్ ఉంది అక్కడి కూడలిలో ప్రసంగించాలనుకున్నారు. విషయం తెలిసిన అభిమానులు. రెక్కలు, ముక్కలు చేసి సంపాదించుకున్న సొమ్ముతో. ఫ్లెక్సీలు చేయించుకున్నారు. వాటిని కట్టబోయి ప్రమాదానికి గురయ్యారు. కరెంట్‌కు షాక్‌కు గురై ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. చనిపోయిన ఇద్దరూ మెగా ఫ్యామిలీకి వీరాభిమానులు. మెగా హీరోల సినిమాలొస్తే మాత్రం. ధియేటర్‌ను అలంకరిస్తారు. అంత అభిమానం వారికి. ఇక వాళ్ళ సొంత ఊరు తమ అభిమాన నటుడు వస్తున్నాడంటే ఊరికే ఉంటారా ..? కొద్దిరోజులుగా వీరికి పండగ వాతావరణమే. కానీ విధి వారిని కరెంట్ రూపం లో తీసుకుపోయింది. తోపుడు బండ్ల మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరు ఆ కుటుంబాలకు ఆధారం.