"జనసేన" లో "ఈ క్లారిటీ మిస్" అయ్యిందా..?     2018-05-12   22:18:21  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి చూస్తుంటే తన అన్న చిరంజీవి పరిస్థితే మళ్ళీ తనకి వచ్చేలా ఉందేమో అనే సందేహం కలుగుతోంది..అయితే తన అన్న స్థాపించిన ప్రరాపా పార్టీ మాత్రం ఎంతో హుందా రాజకీయాలు చేసింది ఎక్కడా చిన్నపిల్లల ఆటల మాదిరి నడుచుకోలేదు..ప్రరాపాలో ఎంతో మంది సీనియర్ నేతలు..తలపండిన రాజకీయ నాయకులు ఉన్నా సరే వారందరూ ఆ సమయంలో చిరంజీవికి ఒక నిర్దిష్టమైన దారిని చూపించలేక పోయారు..అయితే ఇప్పుడు పవన్ పెట్టిన పార్టీ కి అసలు దిశా నిర్దేశం లేదు..

పవన్ కళ్యాణ్ ఎప్పడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం దిశగా అందరూ పరుగులు పెట్టాల్సిందే..పార్టీ కి ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక లేదు…చెప్పే మాటలు చేసే పనులు మాత్రం కోటలు దాటుతాయి , కానీ చేతలు మాత్రం కనిపించడంలేదు. ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయంలేదు .. అందునా ముందస్తు ఎన్నికలు అంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే కసరత్తు చేస్తుంటే .. జనసేన మాత్రం ఇంకా వెనుకబడిపోయే కనిపిస్తోంది…ఆలోచనల్లో మునిగి తేలుతోంది..ఏపీ మొదలు తెలంగాణలో సైతం అన్ని నియోజక వర్గాలలో మా పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ ఇప్పటి వరకూ ఆ దిశగా అడుగులు వేయకపోవడం తన టైం పాస్ రాజకీయానికి నిదర్సనం…