పవన్ కు క్లారిటీ వచ్చేసిందా ..? మాటల తూటాలు పేల్చేస్తున్నాడుగా !     2018-05-20   21:44:15  IST  Bhanu C

అధికారం మీద జనసేనకు ఆశ ఉందని..2019లో ప్రజల సహాయ..సహకారాలతో సరికొత్త ప్రభుత్వం వస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని..ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో నిలబడుతామని, 175 స్థానాల్లో పోటీ చేస్తామని అయన ప్రకటించాడు. శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు పవన్ నిరసన కవాతు నిర్వహించారు. ఈ కవాతులో జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం రాజావారి మైదానంలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ఆయన టిడిపి, బిజెపి పార్టీలపై విమర్శల బాణాలు వదిలారు.

గతంలో టిడిపి..బిజెపి పార్టీలకు మద్దతినిచ్చినప్పుడు నేను ఎటువంటి పదవి కోరుకోలేదని..ఏ కాంట్రాక్టర్ అవసరం లేదన్నారు. 600 పైకి ఎక్కువగా హామీలు టిడిపి మెనిఫెస్టోలో ఉన్నాయని..ఈ విషయాన్ని తాను ప్రశ్నించానని..తనను నమ్మాలని బాబు నాకు చెప్పాడన్నారు. పార్లమెంట్ హాల్ లోకి వెళ్లేముందు మెట్లు మొక్కిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ ఆశలను..ఆశయాలను నెరవేరుస్తానని నమ్మకం కలిగిందన్నారు. కానీ ఆ నమ్మకం ఇప్పుడు కలగడం లేదని పవన్ చెప్పారు.