జనసేన లో ఈ క్లారిటీ ఉందా ..? అభ్యర్ధులు ఉన్నారా ..?    2018-06-03   00:27:33  IST 

ప్రశ్నించడమే తన పని నాకు ఎటువంటి పదవులు అవసరమే లేదంటూ పదే పదే చెప్పిన పవన్ ఇప్పుడు ప్రజాపోరాట యాత్రతో తన ఆలోచనను మార్చినట్లే కనిపిస్తుంది. తాను కూడా వైఎస్ జగన్ మాదిరి అధికారం ఉంటేనే ప్రజలకు మరింత సేవ చేయొచ్చని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోయినా ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించేశాడు. ఈ ప్రకటనే అందరిలోనూ సందేహాలు రేకెత్తిస్తోంది.

ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏపీలో బలమైన టీడీపీ , వైసీపీ పార్టీలు ఎప్పటి నుంచో వ్యూహాలు రూపొందించుకుని అభ్యర్థులను కూడా దాదాపు సిద్ధం చేసుకున్నాయి. ఆఆ నియోజకవర్గాల్లో తమ బలం నిరుపించుకోవడానికి . జన,ధన బలం ఉన్న నాయకులు టీడీపీ మరియు వైసీపీలో ఉన్నారు. కానీ జనసేన పరిస్థితి అలా కాదు.