Pawan Kalyan Bus Yatra Tragets YS Jagan Padayatra

జ‌న‌సేన అధినేత ఫుల్ టైం పొలిటిషీయ‌న్‌గా ప్ర‌జాక్షేత్రం అడుగుపెట్టే టైం ఫిక్స్ అయ్యింది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ప‌నిచేస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత ద‌స‌రా నుంచి త‌న టైంను పూర్తిగా రాజ‌కీయాల‌కు స్పెండ్ చేయ‌నున్నాడు. అక్టోబ‌ర్ నుంచి ప‌వ‌న్ ర‌థ‌యాత్ర ప్రారంభంకానుంది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా జ‌న‌సేన బ‌స్సు కూడా రెడీ అవుతోంది.

సక‌ల సౌక‌ర్యాలు ఉన్న ఈ బ‌స్సులో ప‌వ‌న్ ఒకేసారి అన్ని జిల్లాల్లోను ప‌ర్య‌టించ‌నున్నాడు. తాజాగా ఉద్దానం స‌మ‌స్య‌పై మాట్లాడేందుకు చంద్రబాబును క‌లిసిన ప‌వ‌న్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకే తాను ఈ బ‌స్సు యాత్ర చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. ముందు పాద‌యాత్ర చేయాల‌ని అనుకున్నా భ‌ద్ర‌తా కారాణాల దృష్ట్యా ప‌వ‌న్ త‌ర్వాత పాద‌యాత్ర మానుకుని బ‌స్సు యాత్ర‌కు రెడీ అవుతున్నారు.