తిరుపతిలో “చంద్రబాబు దీక్ష” కి కౌంటర్ సిద్దం చేసిన “పవన్”     2018-04-25   01:05:33  IST  Bhanu C

ఎపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు ,తన పార్టీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,కారకర్తలు అందరూ కలిసి నిరసనలు చేపడుతున్న విషయం అందరికే తెలిసిందే అయితే మొన్న విజయవాడలో చంద్రబాబు చేసిన ఒకరోజు దీక్ష కోసం ముందు నుంచీ ఎంతో ప్లాన్డ్ గా వెళ్ళిన చంద్రబాబు కి మోకాలు అడ్డుపెట్టాడు పవన్ కళ్యాణ్…పవన్ గనుకా ఆ సమయంలో మీడియా దృష్టిని ఆకర్షించకుండా ఉండి ఉంటే ఆ దీక్ష ఎఫెక్ట్ ఢిల్లీ ని మరింత బలంగా తాకేది అయితే కానీ కావాలనే పవన్ మీడియా దృష్టి మరల్చాడు అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడే కామెంట్స్ చేశారు..

ఇదిలాఉంటే చంద్రబాబు తిరుపతిలో చేపట్టబోయే మరో దీక్షని సైతం పవన్ కళ్యాణ్ అడ్డుపడనున్నారట..చంద్రబాబు బాబు దీక్షకి మైలేజ్ రాకుండా చేయడానికే పవన్ ఈ సేక్చ్ వేశాడని అంటున్నారు టీడీపి నేతలు.. బాబు సభ విజయవంతం కాకుండా పవన్‌ రోడ్‌షోలు నిర్వహించి జనసేన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు..ఇందుకోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా సిద్దం చేస్తున్నారట..అంతేకాదు చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో తెలుగుదేశం పార్టీ మైలేజ్ ని తగ్గించాలనే టార్గెట్ జగన్ ,పవన్ పెట్టుకున్నారట..అందులో భాగంగానే ఈ పవన్ పాదయాత్ర చేపడుతూనే వైసీపి నేతలతో ,జనసేన పార్టీ నేతలతో సమావేశాలు పెట్టనున్నారని తెలుస్తోంది.